Posts

Showing posts from April, 2022

bhagavadgeeta

  భగవద్గీత (ఘంటశాల) : పద్మశ్రీ ఘంటశాల గారు ఆలపించిన భగవద్గీత 1. భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారంశము, భక్తుడైన అర్జునకు ఒనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారతయుద్దము జరుగరాదని సర్వవిధముల భగవానుడు ప్రయత్నించెను. కానీ, ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్ధములాయెను. అటుపిమ్మట శ్రీకృష్ణుడు పార్దునకు సారధియై నిలిచెను. యుద్దరంగమున అర్జునుని కోరిక మేరకు రధమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయం ద్రవించి. 2. స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయాము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్భాణములను క్రింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మా... ౩. దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చిగాని, నిత్యములు, శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చిగాని దుఃఖింపరు. 4. జీవునకు దేహమునందు బాల్యము, యౌవనము, ముసలితనము యేట్లో మరొక దేహమును పొందుటకు కూడా అట్లే కనుక ఈ విషయమున ధీరులు మోహము నొందరు. 5. మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రములను వదలి నూతన వస్త్రములను ధరించునో అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును...